Saturday, August 2, 2025
E-PAPER
Homeజిల్లాలుబంజారుల సంస్కృతికి ప్రతీక తీజ్‌ పండుగ: బీర్ల అయిలయ్య

బంజారుల సంస్కృతికి ప్రతీక తీజ్‌ పండుగ: బీర్ల అయిలయ్య

- Advertisement -

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య  
నవతెలంగాణ – బొమ్మల రామారం 

బంజారుల కట్టుబొట్టు సంస్కృతీ సంప్రదాయాలకు తీజ్‌ పండుగ ప్రతీకగా నీలుస్తుందని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. మండలంలోని లక్ష్మీ తండా,భూక్య తండాలో గురువారం బంజారుల సంస్కృతికి ప్రతీక తీజ్‌ పండుగ పండుగలో పాల్గొన్నారు. ప్రతి ఏడాది శ్రావణమాసంలో ప్రతి తండాల్లో నిర్వహించే అడవి దేవతల వేడుకల్లో పెండ్లి కాని యువతులతో మొలకల పండుగ ఘనంగా నిర్వహిస్తారని అన్నారు. బంజారుల కట్టుబొట్టు సంస్కృతీ సంప్రదాయాలకు తీజ్‌ పండుగ ప్రతీకగా నిలుస్తుందని, గిరిజనుల, ఆచారాలు, పండుగలు, సాంప్రదాయాలు ప్రత్యేకంగా ఉంటాయని తెలిపారు.

గిరిజనులు (బంజారులు) నిర్వహించుకునే ప్రతి పండుగకూ ఓ ప్రత్యేకత ఉంటుందని తెలిపారు. నల్లమల ప్రాంతంలో ప్రతి ఏడాది శ్రావణమాసంలో తీజ్‌ పండుగను ఘనంగా నిర్వహిస్తారని వెల్లడించారు. గిరిజన సాంప్రదాయ బద్ధంగా నిర్వహించుకునే పండుగల్లో తీజ్‌కు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. బంజారుల సంస్కృతిని కాపాడుతూ ప్రకృతిని ఆరాధించే మొలకల పండుగ సందడి తండాలు, గ్రామాల్లో ఇప్పటికే ప్రారంభమైందని అన్నారు. పెండ్ల్లికాని యువతులు తొమ్మిదిరోజులపాటు భక్తిశ్రద్ధలతో మట్టిని, మొలకలను ఆదరిస్తూ బంజారా మహిళలు, యువతుల ఆటపాటలు, నృత్యా లు, డప్పుల మధ్య భక్తిభావంతో తొమ్మిదిరోజుల పాటు ఉపవాసాలు ఉండి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని, తండాలు, గ్రామాల్లోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పశువులకు ఎలాంటి వ్యాధులు సోకవద్దని కోరుతూ పూజిస్తారాని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలునాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -