Friday, October 17, 2025
E-PAPER
Homeజాతీయంపూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ‘తేజస్ Mk1A’

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ‘తేజస్ Mk1A’

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భారతదేశ స్వదేశీ యుద్ధ విమానం తేజస్ Mk1A , శుక్ర‌వారం నాసిక్‌లో తన మొదటి అధికారిక విమానయానాన్ని ప్రారంభించింది.ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ విమానాన్ని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తయారు చేసింది. ఇదే కార్యక్రమం వేదికగా LCA (లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) కోసం HAL మూడవ ఉత్పత్తి లైన్, HTT-40 శిక్షణా విమానం కోసం దాని రెండవ ఉత్పత్తి లైన్ ప్రారంభించారు. వీటిని భారతదేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో కీలక ముందు అడుగుగా నిపుణులు పేర్కొన్నారు.

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన యుద్ధ విమానం తేజస్. ఇది 4.5 తరం బహుళ పాత్ర పోషించే యుద్ధ విమానం. అంటే ఇది ఏకకాలంలో వాయు, భూమి, సముద్ర దాడుల మిషన్లను నిర్వహించగలదు. తేజస్ Mk1 విమానం ఇప్పటికే వైమానిక దళంతో సేవలో ఉంది. కానీ ఇది Mk1A అధునాతన వెర్షన్. ఈ కొత్త యుద్ధ విమానాలు సరికొత్త సాంకేతికతలను కలిగి ఉంటాయి. వీటి రాకతో భారత వైమానిక దళం మరింత శక్తివంతం అవుతుందని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -