- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని పడకల్ లోని జడ్.పి.హెచ్.ఎస్. పాఠశాలలో నిర్వహించిన అంతర్ పాఠశాలల క్రీడా పోటీలలో, తేజస్ విద్యా నికేతన్ విద్యార్థులు మార్చ్ పాస్ట్ విభాగంలో మొదటి బహుమతి సాధించి పాఠశాలకు గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి బాహుమతి అందజేశారు. ఈ విజయం విద్యార్థుల క్రమశిక్షణ, అంకితభావం మరియు అద్భుతమైన జట్టు స్ఫూర్తికి నిదర్శనమని పాఠశాల యాజమాన్యం తెలియజేసింది. ఈ విజయాన్ని సాధ్యం చేసిన విద్యార్థులను, వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులు, కోచ్ లను, మరియు తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం అభినందించింది. ఇలాంటి విజయాలు భవిష్యత్తులోనూ మరిన్ని సాధించాలని ఆకాంక్షించింది.
- Advertisement -