Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నీట్ ఫలితాలలో ప్రతిభ కనపర్చిన తేజశ్రీ

నీట్ ఫలితాలలో ప్రతిభ కనపర్చిన తేజశ్రీ

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన అందుగుల సైదమ్మ,వెంకటయ్య దంపతుల రెండో కుమార్తె తేజశ్రీ నీట్ ఫలితాల్లో ఉత్తమ ఫలితం సాధించి రామగుండం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్సీటుసాధించింది. కళాశాలలో ఫీజు చెల్లించలేక కూలి పనులకు వెళుతుంది. తేజశ్రీ అక్క ప్రవళిక కూడా మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్  నాలుగవ  సంవత్సరం చదువుతుంది. చదువులో ముందంజలో ఉన్న తేజశ్రీ, ప్రవళిక చదువులు కొనసాగించడానికి ఆర్థిక ఇబ్బందులు పడుతూ  చండూరు మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త గురిజ మహేష్ ని చదువుల ఆర్థిక సహకారం కోసం సంప్రదించారు.

స్ఫూర్తి ఫౌండేషన్, హైదరాబాద్ స్థాపకులు శ్రీవ్యాల్ వీరి కుటుంబ ఆర్థిక ఇబ్బందులను, చదువుల పరిస్థితిని  గురిజ మహేష్ వివరించగా స్ఫూర్తి ఫౌండేషన్ శ్రీవ్యాల్  చదువుల సహకారం కోసం రూ.82,000 ఆర్థికసహయం షేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు సామాజిక కార్యకర్త గురిజ మహేష్ మాట్లాడుతూ.. పేదరికం కారణంగా ఎంబీబీస్ లాంటి ఉన్నత చదువులు చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న  విద్యార్థులు ఎవరైనా ఉంటే ఆర్థిక సహాయం కోసం తన ఫోన్ నెంబర్  9182498463 ని సంప్రదించాలని కోరారు.ఉత్తమప్రతిభగల పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త ప్రభుత్వ ఉపాధ్యాయులు గురిజ మహేష్, అందుగుల సైదమ్మ, వెంకటయ్య ప్రవళిక, తేజశ్రీ పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -