- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: రఘోపూర్ అసెంబ్లీ స్థానంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ గెలిచారు. 11 వేల ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్(1,04,065 ) యాదవ్‌పై తేజస్వీ యాదవ్ విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ఆధిక్యంలో కొనసాగిన తేజస్వీ.. ఆ తర్వాత వెనుకంజలో ఉన్నారు. చివరకు విజయం వరించింది. తాజా గెలుపుతో తేజస్వీ యాదవ్ వరుసగా మూడోసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. తేజస్వీ యాదవ్‌కు 1,19,780 ఓట్లు పోలయ్యాయి.
- Advertisement -



