నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాని మోడీకి ఆర్జేడీ సీనియర్ నాయకులు కౌంటర్ ఇచ్చారు. ఎవరి మదర్ పట్ల అసభ్యంగా మాట్లాడింది లేదని, బీజేపీ నేతలే ప్రతినిత్యం కెమెరాల ముందు భారతీయ స్త్రీలను అవమానపరుస్తున్నారని ఆర్జీడీ అగ్రనేత తేజిస్వీ యాదవ్ అన్నారు. ఆ తరహా వ్యాఖ్యలకు తాము అంగీకరించమన్నారు. కానీ ఆ చర్యలను ప్రోత్సహిచే తత్వం బీజేపీ, నితిష్ కుమార్‌ల DNAలోనే ఉందని విమర్శించారు. గతంలో సోనియా గాంధీతో పాటు పలువురు మహిళలను కించపరించిన చరిత్ర ఎన్డీయే కూటమి నేతలకు ఉందని ఆయన తెలియజేశారు.
గతంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన కుటుంబసభ్యుల పట్ల కొందరు బీజేపీ నాయకులు అభ్యంతరకరంగా మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. బీహార్ ప్రజలు ప్రతీది గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో ఎన్డీయే కూటమికి ఓట్లతో బుద్దిచెప్పుతారని తేజిస్వీ యాదవ్ అన్నారు.
“ప్రధానమంత్రి చాలా రోజులు విదేశాల్లో ఉన్నారు, ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఏడవడం మొదలుపెట్టారు, కానీ విదేశాల్లో ఆయనను చూసి నవ్వుతున్నారు” అని యాదవ్ విలేకరులతో అన్నారు.