Sunday, July 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జేసీఐ శిక్షణ శిబిరానికి తేజస్వి తిరునగరి

జేసీఐ శిక్షణ శిబిరానికి తేజస్వి తిరునగరి

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
జులై తేది 25 నుండి 27 వరకు హైదరాబాద్ లో జోన్ 12, హైదరాబాద్ నవ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జేసీఐ స్పీచ్ క్రాఫ్ట్- 2.0 శిక్షణ శిబిరానికి తేజస్వి తిరునగరి హాజరు అయ్యారు. జేసీఐ లో ట్రైనర్ గా అవడానికి ఇట్టి శిక్షణ తప్పనిసరి హాజరై ఉండాలి. ఇట్టి శిబిరం లో 30 సభ్యులకు మాత్రమే అనుమతిని ఇస్తారు. 

పైలెట్ (ట్రైనర్) గా నేషనల్ ట్రైనర్ డా.శివ సత్యనారాయణ, కో పైలెట్ లు గా నేషనల్ ట్రైనర్ లు డా.శ్రీ చందన, సత్యవాణి శిక్షణ నైపుణ్యాలను నేర్పిస్తారు. తేజస్వి తిరునగరి తండ్రి జేసీఐ ఇందూర్ పూర్వ అధ్యక్షునిగా వ్యవహరించారు.  ప్రస్తుతం వారు మోటివేషనల్ శిక్షణుడిగా సేవలందిస్తున్నారు.

తేజస్వి రాసిన “ది పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్” పుస్తకాన్ని ట్రైనర్ లకు అందించినారు. ట్రైనరలు తేజస్వి ని అభినందించారు. కార్యక్రమం లో జోన్ 12 అధ్యక్షులు చతుర్వేది, పూర్వ జోన్ అధ్యక్షులు డా. రవికాంత్, నల్ల సంతోష్ అతిథులుగా మరియు ఉపాధ్యక్షులు సంకీత్ జైన్, జోన్ డైరెక్టర్ (శిక్షణ విభాగం) నార్లపురం రాజు, కార్యక్రమం చైర్మన్ వజ్జ మహేందర్, ట్రైనర్ రఘునందన్, హోస్ట్ అధ్యక్షురాలు స్వప్న అరెల్లి, రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -