Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుతెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం శ్రామిక వర్గ పోరాటం

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం శ్రామిక వర్గ పోరాటం

- Advertisement -

చరిత్రను వక్రీకరిస్తూ మతాల మధ్య బీజేపీ చిచ్చు
10వ తేదీ నుంచి 17 వరకు వారోత్సవాలు
17న ఖమ్మం, జనగామల్లో బహిరంగ సభలు
హాజరుకానున్న పార్టీ అఖిల భారత కార్యదర్శి ఏంఏ బేబీ : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
12న సీతారాం ఏచూరి వర్ధంతి సందర్భంగా సభలు
నవతెలంగాణ-కందుకూరు

శ్రామిక వర్గ పోరాటమైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని.. హిందూ, ముస్లిం పంచాయితీగా బీజేపీ ప్రచారం చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. చరిత్రను వక్రీకరిస్తూ మతాల మధ్య చిచ్చు పెడుతున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలోని పాషా-నరహరి స్మారక కేంద్రంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుబ్బాక రామచందర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 1946-1951 మధ్య నిజాం రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌కు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన విరోచిత పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటమని అన్నారు. భూస్వాములు, నిజాం సాయుధ దళాలైన రజాకార్లను ఎదుర్కోవడానికి రైతులు, మహిళలు, పిల్లలు గెరిల్లా దళాలుగా ఏర్పడి ఉద్యమించారని గుర్తు చేశారు. ఈ పోరాటంలో నాలుగు వేల మంది అమరులయ్యారని తెలిపారు. వారి త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ వారం రోజుల పాటు సభలు, సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు భారీగా నిర్వహించాలన్నారు. ఈ నెల 17న ఖమ్మం , జనగామలో నిర్వహించనున్న వారోత్సవాల ముగింపు బహిరంగసభలో తమ పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ పాల్గొంటారని తెలిపారు. అదేవిధంగా ఈనెల 12న సీతారాం ఏచూరి వర్ధంతి సందర్భంగా అన్ని జిల్లాలు, మండలాల్లో సభలు సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సీతారాం ఏచూరి మతోన్మాదానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.సామెల్‌, చంద్రమోహన్‌, కె.జగన్‌, ఈ.నరసింహ, కె.భాస్కర్‌, జగదీష్‌, కవిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad