ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సుమారు నిజామాబాదు జిల్లా లోని ప్రభుత్వ పాఠశాల లో పని చేస్తున్న బ్రాహ్మణ ఉపాధ్యాయులకు ప్రశంస పత్రంతో శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా విద్యాధికారి జిల్లాాా విద్యాశాఖ అధికారి పి అశోక్ చేతుల మీదుగా బ్రాహ్మణ ఉపాధ్యాయులందరికీ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డిిి ఇ ఓ అశోక్ మాట్లాడుతూ.. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం సభ్యులని డీఈవో అభినందించారు.
సంఘ అధ్యక్షులు శశికాంత్ కుల కర్ణి మాట్లాడుతూ.. అమ్మనాన్న ఉపాధ్యాయులను సత్కరించడం ఎంతో అభినందనీయమని ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి రమేష్ కులకర్ణి, లక్ష్మి గణపతి అధ్యక్షులు అరుణ్ కుమార్ శర్మ, పూర్వధ్యాకష్యులు కిరణ్ దేశ్ ముఖ్, గౌరవ అధ్యక్షులు కంజర్కర్ భూపతిరావు, కోశాధికారి మిలింద్, సంగం ఉపాధ్యక్షులు కోళవి విజయ్ కుమార్, లక్ష్మి నారాయణ భరద్వాజ్, సౌమ్య భరద్వాజ్, పుల్కల్ రమేష్, రాజ్ కాంత్ రావు కులకర్ణి, ప్రకాష్ కులకర్ణి, శైలజ అవిక్షిత్, బ్రాహ్మణ బంధువులు తదితరులు పాల్గొన్నారు.