Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..

నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: ఎప్పుడెప్పుడా అని ఆశావహులను ఊరిస్తున్న తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ఎట్టకేలకు మూహుర్తం ఖారారైంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల తరవాత రాజ్ భవన్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. మంత్రివర్గ విస్తరణలో ఆరు ఖాళీలు ఉన్నప్పటికి కొత్తగా ముగ్గురికి చోటు కల్పిస్తారని..మరికొంత కాలం తర్వాతా మరో ముగ్గురికి అవకాశం ఇస్తారని తెలుస్తుంది.
మంత్రివర్గంలో కనీసం ముగ్గురు నుండి నలుగురికి చోటు ద‌క్క‌నుంది. కొత్త మంత్రులుగా చెన్నూరు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి,ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్, మనకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రులుగా నేడు మధ్యాహ్నం రాజ్ భవన్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్ర‌మానికి సాధారణ పరిపాలన శాఖ ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img