నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ భేటీ ప్రారంభం అయింది. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అవకతవకలపై విచారణను ఏసీబీకి అప్పగించాలా..? లేదా సిట్ ను ఏర్పాటు చేయాలా..? అనే అంశాలపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కాళేశ్వరం వ్యవహారం పై చర్చ జరపాలని మంత్రి వర్గం యోచిస్తున్నట్టు సమాచారం.
ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి, నిర్లక్ష్యం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ 15 నెలల పాటు 119 మందిని విచారణ జరిపి.. ఆగస్టు 01న 650 పేజీలతో కూడిన మూడు వాల్యూమ్ ల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి అందజేయగా.. నివేదిక పై అధ్యయన కమిటీ ఏర్పాటు చేశారు. ఇవాళ క్యాబినెట్ సమావేశంలో నివేదిక పై చర్చించి అడ్వకేట్ జనరల్ కి న్యాయపరమైన సలహాల కోసం పంపి.. ఆ తరువాత శాసనసభలో ప్రవేేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.