Monday, December 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ..

నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ క్యాబినెట్ జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీల రిజర్వేషన్ల అమలుపైనే ప్రధాన చర్చ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్, ఇతర అంశాలపైనా మంత్రి మండలి చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవల మరణించిన అందెశ్రీకి గుర్తుగా స్మృతి వనం, ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంపై క్యాబినెట్ నిర్ణయం తీసుకోనుంది.కాగా.. స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో నవంబర్ 24వ తేదీలోగా చెప్పాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో నేడు జరగనున్న క్యాబినెట్ భేటీలో స్థానిక ఎన్నికలపై జరిపే చర్చ ప్రాధాన్యం సంతరించుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -