- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తరహాలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురానున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. గురువారం సెక్రటేరియట్‌లో సీఎంతో హిమాచల్‌ప్రదేశ్ మంత్రి రోహిత్ కుమార్ భేటీ అయ్యారు. అన్ని వర్గాల విద్యార్థులకు ఒకే చోట రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు సీఎం ఆయనకు తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ విద్య, చిన్నారులను స్కూళ్లకు తీసుకెళ్లేందుకు రవాణా సౌకర్యాన్ని కల్పించే అంశంపై యోచిస్తున్నామని చెప్పారు.
- Advertisement -



