- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. విద్యుత్ అంతరాయాలను తక్షణమే పరిష్కరించడానికి 108 అంబులెన్స్ తరహాలో విద్యుత్ అంబులెన్స్ లను ప్రవేశపెట్టింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతులు 1912 నెంబర్ కు కాల్ చేస్తే, మొబైల్ ట్రాన్స్ ఫార్మర్లు, థర్మల్ విజన్ కెమెరాలు, సేఫ్టీ గేర్ బాక్సులతో కూడిన వాహనం ఇంజినీర్, ఇద్దరు సిబ్బందితో సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తుందని తెలిపారు.
- Advertisement -



