No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeట్రెండింగ్ న్యూస్తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..త్వరలో 5,368 ఉద్యోగాల భర్తీ

తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..త్వరలో 5,368 ఉద్యోగాల భర్తీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థల్లో ఖాళీగా ఉన్న 5,368 ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనున్నారు. బీటెక్‌/బీఈ, డిప్లొమా, ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులతో ఈ ఉద్యోగాల నియామకాలు చేపడతారు. తెలంగాణ రాష్ట్ర ఉత్తర డిస్కమ్‌ (ఎన్పీడీసీఎల్‌) పరిధిలో 2,170, దక్షిణ డిస్కమ్‌ (ఎస్పీడీసీఎల్‌) పరిధిలో 2,005, తెలంగాణ ట్రాన్స్‌కోలో 703, తెలంగాణ జెన్‌కోలో 490 కొలువుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ వెలువడనున్నది. ఎన్పీడీసీఎల్‌లో 44 అసిస్టెంట్‌ ఇంజనీర్లు (ఏఈ), 30 సబ్‌ ఇంజనీర్‌, 2,090 జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం) పోస్టులు.. ఎస్పీడీసీఎల్‌లో 45 అసిస్టెంట్‌ ఇంజనీర్లు (ఏఈ), 30 సబ్‌ ఇంజనీర్లు, 1650 జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం) పోస్టులకు నియామకాలు చేపడతారు.
ఇక తెలంగాణ ట్రాన్స్‌కోలో 437 అసిస్టెంట్‌ ఇంజనీర్లు (ఏఈ), 63 సబ్‌ ఇంజనీర్‌, 189 జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం), 14 జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌/జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ పోస్టులతో కలిపి 703 పోస్టులు రిక్రూట్‌ చేస్తారు. తెలంగాణ జెన్‌కోలో 175 ఏఈ, 150 సబ్‌ ఇంజనీర్‌, 165 జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌/ జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌/ కెమిస్ట్‌/ జూనియర్‌ పర్సనల్‌ అటెండెంట్‌ పోస్టులతో కలిపి 490 భర్తీ చేయనున్నారు. తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో.. బీటెక్‌/బీఈ పూర్తి చేసిన అభ్యర్థులతో 701 ఏఈ, పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రికల్‌ డిప్లమా చేసిన అభ్యర్థులతో 509 సబ్‌ జూనియర్‌ ఇంజనీర్‌, ఐటీఐలో ఎలక్ట్రీషియన్‌ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులతో భర్తీ చేస్తారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad