Wednesday, September 17, 2025
E-PAPER
Homeజిల్లాలువీరోచిత సమర చరిత్ర తెలంగాణది : సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు ఎస్.వీరయ్య

వీరోచిత సమర చరిత్ర తెలంగాణది : సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు ఎస్.వీరయ్య

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తికోసం సాగిన మహాత్తర సాయుధ రైతాంగ పోరాటాన్ని మత ఘర్షణగా చిత్రీకరించే వక్రబుద్ధి బీజేపీ , ఆరెఎస్ఎస్ లదని సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. సీపీఐ(ఎం) హైదరాబాద్ సెంట్రల్ సిటి కమిటీ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై గల తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు మఖ్దూం మొహియుద్దీన్ విగ్రహం వద్ద తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వీరయ్య మాట్లాడుతూ ‘విమోచన’ పేరుతో ముస్లింల మీద హిందువులు సాధించిన విజయంగా చిత్రీకరించడటమే వారి పని అని అన్నారు.

నిజానికి ‘సెప్టెంబర్‌ 17’ ఎర్ర జెండా వారసులు కవాతు చేయవల్సిన రోజు. రైతాంగ పోరాట ఫలితమే ఈ విలీనం! సమైక్య భారతదేశంలో హైదరాబాదు రాజ్యంలో భాగమైన తెలంగాణ విలీనమౌతున్న సందర్భంలో అదే రాజ్యంలోని మరఠ్వాడా ప్రాంతంలో భయంకరమైన మతచిచ్చుపెట్టి సమైక్యతకు విఘాతం సృష్టించే ప్రయత్నం చేసింది ఆరెఎప్ఎప్ దాని పరివారం అని తెలిపారు. శ్రామిక ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేసి, బడా బాబుల ప్రయోజనాలను కాపాడేందుకు ఒక రాజకీయ సాధనంగానే బీజేపీ పనిచేస్తున్నదని చెప్పారు.

తెలంగాణలో మతపరమైన విభజన సృష్టించి రాజకీయ లబ్ది పొందడం కోసమే విమోచన దినోత్సవం పేరుతో రాద్ధాంతం చేస్తున్నదని అన్నారు. దీనిని అందరం ఐక్యతతో తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు టీ.జ్యోతి, సీపీఐ(ఎం) హైదరాబాద్ సెంట్రల్ సిటి కమిటీ కార్యదర్శి వెంకటేష్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ప్రజానాట్యమండలి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -