Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుతెలంగాణకు నూతన విద్యా విధానం కావాలి: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణకు నూతన విద్యా విధానం కావాలి: సీఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణకు నూతన విద్యా విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు బోధిస్తున్నట్లు చెప్పారు. మాదాపూర్‌లో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. గత పదేళ్ల నుంచి విద్యా శాఖలో అనే సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయని తెలిపారు. అందుకే తాను స్వయంగా విద్యా శాఖను దగ్గర పెట్టుకుని పర్యవేక్షిస్తున్నానని పేర్కొన్నారు. కొందరు విద్యా శాఖకు మంత్రిని నియమించాలని అంటున్నారని, విమర్శలకు తాను ఒక్కటే చెప్పాలని అనుకుంటున్నానని.. ఆ స్థానంలోకి ఎవరు వచ్చినా ఒత్తిడి తట్టుకోలేరని కామెంట్ చేశారు.

గత పదేళ్ల రాష్టంలో అసలు టీచర్ల బదిలీలు జరగలేదని, ఆనాటి పాలకులకు టీచర్లను నియమించాలన్న ఆలోచనే రాలేదని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పదేళ్లు విద్యను కూడా వ్యాపారంగా మార్చి సొమ్ము చేసుకున్నారని ధ్వజమెత్తారు. అసలు విద్యా రంగాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాకే తరచుగా ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరుపుతున్నామని గుర్తు చేశారు. తెలంగాణలో గురుపూజోత్సవం జరిగితే గతంలో ఒక్కసారైనా సీఎం వచ్చారా.. అని ప్రశ్నించారు. అసలు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం గురుపూజోత్సవాన్ని నిర్వహించిందా అని సెటైర్లు వేశారు. కానీ, ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవానికి తాను ముఖ్య అతిథిగా హాజరయ్యాయనని తెలిపారు. టీచర్లను చిన్నచూపు చూసే ఆలోచన తమకు లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 27 లక్షల మంది మాత్రమే చదువుతున్నారని.. మరో 11 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 37 లక్షల మంది చదువుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

పిల్లలకు ప్రభుత్వ రంగంలో సరైన విద్యను అందించకపోవడానికి కారణం మనమేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. టీచర్లకు జీతాలిచ్చి చేతులు దులుపుకోవడం కాదు.. సరైన సదుపాయాలు కూడా ఉండాలన్నారు. రూ.130 కోట్లు అదనంగా సీఎస్ఆర్ ఫండ్స్ నుంచి పాఠశాలలకు అందజేస్తున్నామని పేర్కొన్నారు. నిరుపేదల తలరాతలు మార్చేది చదువు ఒక్కటే అన్న విషయాన్ని తాను బలంగా నమ్ముతానని అన్నారు. రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ వార్తలు చూస్తే బాధేస్తోందని, వసతి గహాల్లో ఇక నుంచి టీచర్లు కూడా విద్యార్థులతో పాటే కలిసి భోజనం చేసి వారిలో ఆత్మస్థై్ర్యాన్ని నింపాలన్నారు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీకి వీసీని కూడా నియమించలేదని.. తాము అధికారంలోకి వచ్చాక సోషల్ జస్టిస్ విత్ మెరిట్‌తో వీసీని నిమమించామని గుర్తు చేశారు. ప్రజాపాలనలో విద్యతో పాటు పేద విద్యార్థుల పట్ల టీచర్లు బాధ్యత వ్యవహరిస్తున్నారని.. భవిష్యత్తులోనూ ఇదే ఒరవడిని కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad