– పోటీలు ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ, నార్త్ ఈస్ట్ రాష్ట్రాల స్పోర్ట్స్ ఫెస్టివల్ శుక్రవారం ఉత్సాహంగా సాగింది. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్) ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన క్రీడా పోటీలను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో తొలుత బ్యాడ్మిం టన్ పోటీలను ప్రారంభించిన గవర్నర్.. క్రీడాకారులతో కలిసి సరదాగా బ్యాడ్మింటన్ రాకెట్ పట్టుకుని అలరించాడు. గచ్చిబౌలి స్టేడియంలో తెలం గాణ, ఈశాన్య రాష్ట్రాల బార్సు, గర్ల్స్ విభాగంలో ఫుట్‌బాల్ పోటీలు జరి గాయి. ‘ఈశాన్య రాష్ట్రాలు, తెలంగాణ గ్రామీణక్రీడల మధ్య సారూప్యత ఉంది. ఈశాన్య రాష్ట్రాలతో తెలంగాణ సంబంధాలను క్రీడలు, స్పోర్ట్స్ కల్చర్ మరింత పెంపొందించగలదని’ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఈశాన్య రాష్ట్రాలు, తెలంగాణలో క్రీడల అభివృద్ది, మౌలిక సదుపాయాలు, శిక్షణ సౌకర్యాలపై క్రీడా పాత్రికేయులు చర్చించారు. మిజోరాం క్రీడాశాఖ మంత్రి లాల్నింగ్లోవా, తెలంగాణ ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, శాట్జ్ చైర్మెన్ శివసేనా రెడ్డి, ఎండీ సోనీబాలదేవి తదితరులు స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు.
ఉత్సాహంగా ‘తెలంగాణ-ఈశాన్య’ స్పోర్ట్స్ ఫెస్టివల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



