– సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విధి నిర్వహణలో తెలంగాణ పోలీసుల సేవలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా కొనియాడారు. స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా కేంద్ర హోంశాఖ రాష్ట్రానికి చెందిన 21 మంది పోలీసులకు పతకాలు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ”పతకాలు సాధించి తెలంగాణ ప్రతిష్టను దేశ స్థాయిలో చాటి చెప్పిన పోలీసు, ఫైర్, హౌంగార్డు సిబ్బందికి నా అభినందనలు. విధి నిర్వహణలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి ప్రతిష్టాత్మక శౌర్య పతకానికి ఎంపికైన కట్రావత్ రాజు నాయక్‌కు ప్రత్యేక అభినందనలు” అని సీఎం పేర్కొన్నారు.
ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మానవ జీవితంలో గీత బోధనలు ఎంతో ప్రభావశీలమైనవని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మానవుడి ప్రతి దశలోనూ కృష్ణ భగవానుడు కొలువై ఉంటారని తెలిపారు. శ్రీమహావిష్ణువు దశావతారాలలో శ్రీకృష్ణావతారం చాలా ప్రత్యేకమైందని పేర్కొన్నారు. దుష్టసంహారం కోసం మానవుడిగా జన్మించి మానవాళికి ఎంఓ అవసరమైన భగవద్గీతను ప్రబోధించారని వివరించారు. శ్రీకృష్ణతత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి పనిలో విజయం సాధించవచ్చని తెలిపారు. కృష్ణ భగవానుడి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కోరారు.
తెలంగాణ పోలీస్ భేష్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES