– డిసెంబర్ 9న డాక్యుమెంట్ ఆవిష్కరణ : సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించుకోబోతున్నట్టు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 ను నిర్వహించనున్నామని తెలిపారు. డిసెంబర్ 8న ప్రజా ప్రభుత్వం రెండో వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని ఆదేశించారు. పాలసీలో తెలంగాణ భవిష్యత్‌కు రోడ్‌మ్యాప్‌ను రూపొందించుకోబోతున్నామనీ, పాలసీ ఆధారంగానే భవిష్యత్ నిర్ణయాలు తీసుకునే వీలుంటుందని చెప్పారు. పాలసీ డాక్యుమెంట్‌తో పెట్టుబడిదారులకు ఒక స్పష్టత వస్తుందని తెలిపారు. శాఖలవారీగా పాలసీలకు సంబంధించి సమ్మిట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులోగా శాఖల వారీగా పాలసీ డాక్యుమెంట్ సిద్ధం చేయాలనీ, గ్లోబల్ సమ్మిట్‌కు వివిధ దేశాల ప్రతినిధు లను ఆహ్వానించాలని సూచించారు. వివిధ దేశాల ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో సెక్యూరిటీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ రైజింగ్ -2047 పాలసీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



