- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో ఇక నుంచి మెరుగైన బీటీ రోడ్ల నిర్మాణం జరుగుతుందని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి నాణ్యమైన రోడ్డు, మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి డబుల్ లేన్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. హ్యామ్ విధానంలో మొదటి ఫేజ్‌లో 17 ప్యాకేజీల్లో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. తొలుత 373 రోడ్లు, 5190.25 కిమీటర్ల నిర్మాణానికి రూ.6478.33 కోట్లతో టెండర్ ప్రక్రియ చేపట్టి పనులు మొదలు పెట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.
- Advertisement -