Tuesday, July 29, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త..

ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. హైదరాబాదు నుంచి విజయవాడ రూట్ లో రాకపోకలు సాగించే ప్రయాణికులకు టికెట్ రేట్ లపై డిస్కౌంట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ టికెట్లపై 16 నుంచి 30 శాతం వరకు డిస్కౌంట్ ఇచ్చేందుకు తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. గరుడ + బస్సుల్లో టికెట్ పై 30% డిస్కౌంట్ ఇవ్వనున్నారు.

ఈ – గరుడాలో 26%, సూపర్ లగ్జరీ, లహరి నాన్ ఏసీ బస్సులలో 20 శాతం డిస్కౌంట్ ఇవ్వబోతున్నారు. రాజధాని, లహరి ఏసి బస్సులలో 16% డిస్కౌంట్ ఉందని తెలంగాణ ఆర్టీసీ తాజాగా పోస్ట్ పెట్టడం జరిగింది. దీంతో.. హైదరాబాద్ నుంచి విజయవాడ అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -