Tuesday, August 5, 2025
E-PAPER
HomeNewsతెలుగు సినీ రంగానికి తీరని లోటు:సీఎం రేవంత్ రెడ్డి

తెలుగు సినీ రంగానికి తీరని లోటు:సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఆయన మరణం విచారకరమన్నారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలు, పోషించిన పాత్రలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు కుటుంసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, 1999లో విజయవాడ నుంచి కోట శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవ చేశారని గుర్తుచేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -