- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. సోమవారం (నేడు) నుంచి టాలివుడ్‌లో సినిమా షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయించింది. తమకు రోజు వారి వేతనాలు 30 శాతం పెంచితేనే షూటింగ్స్‌లో పాల్గొంటామని ఫెడరేషన్ నాయకులు స్పష్టం చేశారు. 30 శాతం వేతనం పెంచిన ప్రొడ్యూసర్ మూవీల షూటింగ్‌లకు మాత్రమే వెళ్తామన్నారు. ఫెడరేషన్ డిమాండ్లను ఫిల్మ్ ఛాంబర్ ఒప్పుకోకపోవడంతో షూటింగ్‌లకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు.
- Advertisement -