Wednesday, October 29, 2025
E-PAPER
Homeఆటలుక్వాలిఫయర్‌కు తెలుగు టైటాన్స్‌

క్వాలిఫయర్‌కు తెలుగు టైటాన్స్‌

- Advertisement -

ఎలిమినేటర్‌లో పట్నాపై గెలుపు
ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ 12

న్యూఢిల్లీ : ప్రొ కబడ్డీ లీగ్‌ 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ జోరు కొనసాగుతుంది. ప్లే ఆఫ్స్‌లో వరుసగా రెండో విజయం సాధించిన తెలుగు టైటాన్స్‌ టైటిల్‌ పోరుకు అడుగు దూరంలో నిలిచింది. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఎలిమినేటర్‌3లో మూడు సార్లు చాంపియన్‌ పట్నా పైరేట్స్‌పై తెలుగు టైటాన్స్‌ 46-39తో ఘన విజయం సాధించింది. నేడు జరిగే క్వాలిఫయర్‌2లో పుణెరి పల్టాన్‌తో తెలుగు టైటాన్స్‌ తలపడనుంది. క్వాలిఫయర్‌2 విజేత నేరుగా ఫైనల్‌కు చేరుకోనుంది. పట్నా పైరేట్స్‌తో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 22-20తో ప్రథమార్థంలోనే పట్టు సాధించింది. అదే జోరు ద్వితీయార్థంలోనూ కొనసాగించి మెరుపు విజయం ఖాతాలో వేసుకుంది. టైటాన్స్‌ ఆల్‌రౌండర్‌ భరత్‌ హుడా 23 పాయింట్లతో వన్‌మ్యాన్‌ షో చేయగా.. పట్నా పైరేట్స్‌ రెయిడర్‌ ఆయాన్‌ 22 రెయిడ్‌ పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. టైటాన్స్‌, పైరేట్స్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్‌సుక్‌ మాండవీయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -