Monday, October 27, 2025
E-PAPER
Homeఆటలుమినీ క్వాలిఫయర్‌లో తెలుగు టైటాన్స్‌ గెలుపు

మినీ క్వాలిఫయర్‌లో తెలుగు టైటాన్స్‌ గెలుపు

- Advertisement -

37-32తో బెంగళూరు బుల్స్‌పై పైచేయి
ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ 14

న్యూఢిల్లీ : ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకెఎల్‌) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ ఎలిమినేటర్‌3కు చేరుకుంది. ఆదివారం న్యూఢిల్లీలోని త్యాగరాజ్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన మినీ క్వాలిఫయర్‌లో బెంగళూరు బుల్స్‌పై 37-32తో ఐదు పాయింట్ల తేడాతో తెలుగు టైటాన్స్‌ ఘన విజయం సాధించింది. తెలుగు టైటాన్స్‌ కెప్టెన్‌ విజయ్ మాలిక్‌ (10 పాయింట్లు), ఆల్‌రౌండర్‌ భరత్‌ హుడా (12 పాయింట్లు) సూపర్‌ టెన్‌ షోతో రాణించారు. బెంగళూర్‌ బుల్స్‌ తరఫున అలీరెజా (11 పాయింట్లు), ఆశీష్‌ మాలిక్‌ (5 పాయింట్లు) రాణించారు. మంగళవారం జరిగే ఎలిమినేటర్‌ 3 మ్యాచ్‌లో.. ఎలిమినేటర్‌ 2 విజేతతో తెలుగు టైటాన్స్‌ తలపడనుంది. మినీ క్వాలిఫయర్‌లో ఓడిన బెంగళూరు బుల్స్‌.. సోమవారం జరిగే ఎలిమినేటర్‌ 2లో పట్నా పైరేట్స్‌తో తలపడనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -