Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్తాత్కాలికంగా ఫీజు చలాన్ కౌంటర్ ను ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేయాలి: ఎస్ఎఫ్ఐ

తాత్కాలికంగా ఫీజు చలాన్ కౌంటర్ ను ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేయాలి: ఎస్ఎఫ్ఐ

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
తాత్కాలికంగా ఫీజు చలాన్ కౌంటర్ ను ఎస్ బి ఐ‌ నుండి ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేయాలని ఎస్ ఎఫ్ ఐ డిమాండ్ చేసింది. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం  యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు కు, ఎస్  బి ఐ మేనేజర్ శ్వేత లకు వేర్వేరుగా సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ హాస్టల్ డిపాజిట్ విషయం లో రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ నీ అమలు చేయాలని కోరారు. అదే విధంగా  లాసెట్ మరియు సి పి సెట్ సందర్భంగా విద్యార్థుల సౌకర్యార్థం కోసం  తాత్కాలికంగా ఫీజు చలాన్ కౌంటర్ నీ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేయాలన్నారు.

ప్రతి సంవత్సరం సీట్లు వచ్చిన విద్యార్థులు సీటు అలాట్మెంట్ కొరకు వచ్చినప్పుడు ప్రతి విద్యార్థి ఫీజు  చలాన్ కట్టడం కోసం ఆర్ట్స్ కళాశాల నుండి అడ్మినిస్ట్రేషన్ వరకు కాలినడకే కొనసాగిస్తున్నారని వాపోయారు. విద్యార్థుల సౌకర్యం కోసం ఎస్బిఐ బ్యాంక్ కౌంటర్ ను తాత్కాలికంగా ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేయాలని,  అలాగే ఇంజనీరింగ్ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యాన్ని కల్పించాలి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ, బీసీ, నాన్ స్కాలర్షిప్ విద్యార్థుల హాస్టల్ డిపాజిట్లను తగ్గించాలని , రోల్ ఆఫ్ రిజర్వేషన్ ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ  కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రాజు కుమార్, యూనివర్సిటీ అధ్యక్షులు జీషణ్, నాయకులు నాగేంద్ర, నిరంజన్ , శ్రీనివాస్, తదితరుల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad