Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తొలిరోజు పది పరీక్షలు ప్రశాంతం

తొలిరోజు పది పరీక్షలు ప్రశాంతం

- Advertisement -

మన్ననూర్ లో పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
నవతెలంగాణ – అచ్చంపేట
జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. 60 కేంద్రాలలో నిర్వహించిన పరీక్షల్లో  10651 మంది విద్యార్థులకుగాను 10630 మంది పరీక్షలు రాశారు.  21 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, తొలిరోజు తెలుగు పరీక్షకు 98.80% హాజరు శాతం నమోదు అయ్యిందని, తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగిందని   డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. అదేవిధంగా ఇదివరకు పరీక్షల్లో తప్పిన ప్రైవేట్ విద్యార్థులు 5 మందికి గాను, నలుగురు విద్యార్థులు హాజరు కాగా ఒక విద్యార్థి గైర్హాజరైనట్లు తెలిపారు.

నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. 60 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించారు. శనివారం అమ్రాబాద్ మండలం మన్ననూరు సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల  పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని  జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై కలెక్టర్ ఆరా తీశారు. తాగునీరు, వైద్యశిబిరాన్ని పరిశీలించి, సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. తొలిరోజు పరీక్షకు హాజరైన విద్యార్థుల హాజరు పై కలెక్టర్ ఆరా తీశారు.  పరీక్షా కేంద్రంలో 208 విద్యార్థులకు గాను 207 మంది హాజరయ్యారని ఒక విద్యార్థి గైర్హాజరయ్యారని సి ఎస్, కలెక్టర్కు తెలిపారు.

విద్యార్థి నేటి తొలి పరీక్షకు గైర్హాజర్ గల కారణాలను తెలుసుకోవాలని, సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు పరీక్షలకు గైర్హాజర్  కాకుండా చూడాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు. పరీక్షల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సి ఎస్, డిఓ లను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 34 పరీక్ష కేంద్రాలను అధికారులు తొలిరోజు తనిఖీలు చేసినట్లు డీఈవో తెలిపారు. డీఈవో రమేష్ కుమార్ పాలెం, నాగర్ కర్నూల్ లో రెండు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి పరీక్ష ప్రక్రియను పరిశీలించారు. 

జిల్లావ్యాప్తంగా 4 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 34 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు డిఇఓ తెలిపారు.  తొలి రోజు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగిందని డిఈవో రమేష్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -