రోడ్డున పడ్డ దళిత కుటుంబం
ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
నవతెలంగాణ – మల్హర్ రావు : అప్పుల బాధతో బండారి దేవేందర్ (34) అనే కౌలు రైతు పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని నాచారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల పూర్తి కథనం ప్రకారం దేవేందర్ కు వ్యవసాయ భూమి లేకపోవడంతో మూడెకరాల భూమిని కౌలు తీసుకొని వ్యవసాయం చేశాడు. పంటలు సరిగ్గా పండక, పండిన ప్రకృతి విపత్తు ద్వారా రూ.5 లక్షల అప్పులు కావడంతో అప్పులు ఎలా తీర్చాలనే మనస్తాపంతో శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాని తెలిపారు.
చికిత్స వెంటనే కోసం కుటుంబ సభ్యులు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వందపడకల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకపోగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లుగా పేర్కొన్నారు. మృతుని భార్య రాధిక ఫిర్యాదు మేరకు కోయ్యుర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి పదేళ్ల లోపు ముగ్గురు పిల్లలున్నారు. పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబం రోడ్డున పడ్డారు. ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు, మృతుని కుటుంబ సభ్యులు వేడుకొంటున్నారు.
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES