నవతెలంగాణ-హైదరాబాద్: సెప్టెంబర్ 4వ తేదీన నేపాల్ ప్రభుత్వం సోషల్‌మీడయాపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సోషల్‌మీడియా మద్దతుదారులు ఆందోళనలకు పిలుపునిచ్చారు. వారి పిలుపుమేరకు యువత సోమవారం భారీ ఎత్తున నిరసనలు నిర్వహించారు. ఆ దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాని నివాసాలను చుట్టుముట్టారు. దీంతో పోలీసులు కాల్పులు జరపడంతో 19 మంది మృతి చెందారు. అయినప్పటికీ.. నేపాల్ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రెండోరోజు మంగళవారం కూడా పెద్దఎత్తున యువత వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు.

కాగా, ఈ రోజు ఉదయం 8.30 గంటల నుంచే పార్లమెంటు వెలుపల రోడ్లని ఆందోళనకారులు నిర్బంధించారు. కలంకి వంటి ప్రాంతాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఆందోళనకారులు రోడ్లను నిర్బంధించారు.
