నవతెలంగాణ – నల్గొండ: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. నల్గొండ పట్టణంలోని ఒ వినాయక విగ్రహం వద్ద మంత్రి కోమటిరెడ్డి శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన చేసిన కాంగ్రెస్ అభివృద్ధి గురించి మంత్రి వివరిస్తుండగా.. దేవుడి దగ్గర రాజకీయాలు మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. వేదికపై తమను ఎందుకు కూర్చోనివ్వరంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో బీజేపీ-కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో నాగం వర్షిత్ రెడ్డిని పోలీసులు అక్కడి నుంచి స్టేషన్‌కి తరలించారు. సంఘటనా స్థలం నుంచి మంత్రి కోమటిరెడ్డి వెళ్లిపోయారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES