Wednesday, December 3, 2025
E-PAPER
Homeబీజినెస్భారత్‌లో టెస్లా కార్లు కొనట్లేదు..!

భారత్‌లో టెస్లా కార్లు కొనట్లేదు..!

- Advertisement -

న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌నకు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం టెస్లాకు భారత మార్కెట్‌లో నిరాశనే ఎదురవుతోంది. ఈ ఏడాది జులై 15న ముంబయిలో తొలి షోరూంను ప్రారంభించిన ఈ కంపెనీకి దేశంలో ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగడం లేదని రిపోర్టులు వస్తోన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో డెలివరీలు మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం 157 కార్లను మాత్రమే టెస్లా విక్రయించినట్లు ప్రభుత్వ వాహన్‌ పోర్టల్‌ గణాంకాలు స్పష్టం చేస్తోన్నాయి. ఇక నవంబర్‌లోనూ కేవలం 48 కార్లను మాత్రమే విక్రయించింది. ఇతర పోటీ ఇవి కంపెనీలతో పోల్చితే చాలా వెనుకబడిపోయింది. భారత్‌లో టెస్లా కార్ల ప్రారంభ ధర రూ.60 లక్షలుగా ఉంది. కాగా భారత్‌లో ఇతర ఇవి కార్ల సగటు ధర రూ.22 లక్షలుగా ఉండటంతో టెస్లా కొనుగోలుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని స్పష్టమవుతోంది. ఈ కంపెనీకి ముంబయి సహా ఢిల్లీలోనూ మరో షోరూం ఉండగా.. గుర్‌గావ్‌లో మరొక్కటి ప్లాన్‌ చేస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -