నవతెలంగాణ-హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) నోటిఫికేషన్ విడుదలయ్యింది. శనివారం నుంచి ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానున్నది. ఈ నెల 29 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 27 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జనవరి 3 నుంచి 31 వరకు పరీక్షలు జరుగుతాయి. ఒక పేపర్‌కు 750, రెండు పేపర్లకు రూ. వెయ్యి ఆన్‌లైన్‌లో ఫీజుగా చెల్లించాలి. గతం లో 2010కి ముందు రిక్రూట్ అయి న టీచర్లకు టెట్ అర్హత నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు సు ప్రీంకోర్టు తీర్పు మేరకు అందరికి టెట్ అర్హత తప్పనిసరి అయ్యింది. ప్రస్తుతం పనిచేస్తున్న వారు రెండేండ్లలోపు టెట్‌లో పాస్ కావాలి. ఐదేం డ్ల లోపు సర్వీస్ ఉన్న వారికి మినహాయింపు ఇచ్చింది. టెట్ లేకపోతే ఉ ద్యోగం కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. దీంతో 2010కి ముందు రిక్రూట్ అయిన వారు టెట్‌రాసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దరఖాస్తు సహా పూర్తి వివరాల కోసం https://schoo ledu.telanga na.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేశారు. 7093708883/7093708884/ 7093958881/ 7093468882 నంబర్లను సంప్రదించవచ్చు.
ఇవాళ నుంచి టెట్ దరఖాస్తులు ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



