Saturday, November 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంటెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన టీజీటెట్‌ -జనవరి,2026 నోటిఫికేషన్‌ వెలువడింది. శనివారం నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించమన్నారు. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 29 వరకు గడువు. టెట్‌ పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు. ఒక్కో పేపర్‌ ఫీజు రూ.750 చొప్పున నిర్ణయించారు. రెండు పేపర్లు రాయాలనుకునే వారు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. 2026 టెట్‌ నోటిఫికేషన్‌ కు సంబంధించిన ఇన్‌ఫర్మేషన్‌ బులెటిన్‌ను పాఠశాల విద్య శాఖ శుక్రవారం జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు టెట్‌లో అర్హత సాధించాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన సవరణలతో నోటిఫికేషన్‌ జారీ చేశారు. డిసెంబర్‌ 27 నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. పరీక్షలను ఉదయం సెషన్‌ 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్‌ 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 10 నుంచి 16 మధ్యలో టెట్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇప్పటికే సర్వీస్‌లో ఉండి టెట్‌ ఉత్తీర్ణులు కానీ ఉపాధ్యాయులు 2027 నాటికి పాస్‌ కావాలనీ, లేనిపక్షంలో ఉద్యోగం వదులుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. నిరుద్యోగ అభ్యర్థులతో పాటు సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులు కూడా అధిక సంఖ్యలో టెట్‌ రాయనుండటంతో ఈ సారి రాసే వారి సంఖ్య మొత్తం 3 లక్షల మంది వరకు ఉండొచ్చని అంచనా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -