టీఆర్టీఎఫ్, ఏపీటీఎఫ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ నిబంధన రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్), ఏపీటీఎఫ్‌లు డిమాండ్ చేశాయి. గురువారం అఖిల భారత విద్యాసంఘాల సమాఖ్య, టీఆర్టీఎఫ్, ఏపీటీఆఫ్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించాయి. వేలాది మంది ఉపాధ్యాయుల హాజరై.. పెద్దఎత్తున చేసిన నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఈ సందర్భంగా టీఆర్టీఎఫ్ అధ్యక్షులు కటకం రమేశ్ మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) ప్రకారం టెట్ నిబంధన అమల్లోకి రాకముందు సర్వీసులో చేరిన ఉపాధ్యాయులకు మినహాయింపు ఉందని గుర్తుచేశారు. అయితే కేంద్రం 2017లో పార్లమెంట్‌లో చట్ట సవరణ చేసి, ఇన్‌సర్వీస్ టీచర్లతో సహా అందరికీ టెట్‌ను తప్పనిసరి చేయడం తీవ్ర అన్యాయమని విమర్శించారు. ఈ సవరణను ఉద్దేశిస్తూ ”ఆట మధ్యలో నిబంధన మార్చడం” లాంటిదని ఆయన అభివర్ణించారు. ఈ సవరణతో ఇన్‌సర్వీస్ టీచర్లకు సమస్య మొదలైందని స్పష్టం చేశారు. ఈ సవరణను తక్షణం రద్దు చేయాలని ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొన్న వేలాది మంది ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఈ సవరణను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ నిబంధన రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



