Wednesday, March 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇంధన పొదుపుపై టీజీ రెడ్కో చర్యలు

ఇంధన పొదుపుపై టీజీ రెడ్కో చర్యలు

- Advertisement -

– గ్లోబల్‌ గ్రీన్‌ గ్రోత్‌ ఇనిస్టిట్యూట్‌తో ఎంవోయూ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఇంధన పొదుపుపై తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో)-అంతర్జాతీయ సంస్థ గ్లోబల్‌ గ్రీన్‌ గ్రోత్‌ ఇనిస్టిట్యూట్‌ (జీజీజీఐ) మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. హైదరాబాద్‌లోని బీఆర్‌.అంబేడ్కర్‌ సచివాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో టీజీ రెడ్కో ఎండీ అనిల-జీజీజీఐ ఇండియా ప్రతినిధి సౌమ్య ప్రసాద్‌ గారానాయక్‌ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో వినూత్న ఆర్థిక నమూనాలు, సాంకేతికతను ప్రవేశపెట్టి ఇంధన వినియోగాన్ని తగ్గించడం ఈ ప్రాజెక్ట్‌ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. డిమాండ్‌ సైడ్‌ మేనేజ్‌మెంట్‌ (డీఎస్‌ఎం), సస్టైనబుల్‌ కూలింగ్‌, గ్రీన్‌ ఎంఎస్‌ఎంఈలు, ఈ-మొబిలిటీ రంగాల్లో ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టనున్నారని తెలిపారు. వినూత్న ఆర్థిక నమూనాలు, ఎస్కో పద్ధతుల ద్వారా ప్రాజెక్ట్‌లకు నిధులను సమీకరిస్తారని చెప్పారు. ఇంధన రంగంలో పనిచేసే సంస్థల సామర్థ్యాన్ని పెంచడానికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, నాలెడ్జ్‌ షేరింగ్‌ సెషన్లు నిర్వహిస్తారని అన్నారు. తెలంగాణను తక్కువ కార్బన్‌ ఉద్గారాల రాష్ట్రంగా మార్చేందుకు జీజీజీఐ తన అంతర్జాతీయ అనుభవాన్ని, సాంకేతిక సహకారాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీజీ రెడ్కో జీఎం జీఎస్‌వీ ప్రసాద్‌, జీజీజీఐ రీజనల్‌ ఆఫీసర్‌ అశోక్‌ బోనం, నేషనల్‌ ప్రొడక్టివిటీ కౌన్సిల్‌ డైరెక్టర్‌ డి.రజనీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -