నవతెలంగాణ – హైదరాబాద్ : సెల్‌ఫోన్ డ్రైవింగ్ ప్రమాదం అని ఎన్ని విధాలుగా పోలీసులు, అధికార యంత్రాంగం హెచ్చరించినా ఏమీ పట్టనట్లు చాలామంది సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుంటారు.. ఇలా ఆర్‌టిసి బస్సుల్లో కూడా డ్రైవర్లు సెల్ ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల చాలా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నట్లు గుర్తించిన తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మేరకు విధుల సమయంలో డ్రైవర్ల వద్ద సెల్‌ఫోన్‌లు ఉండకూడదని నిర్ణయిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కొత్త విధానం నేటినుంచి ( సోమవారం) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది.
అయితే మొదటగా రాష్ట్రంలోని కొన్ని డిపోలో ఈ విధాన్ని అమలు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా తీసుకురావాలని చూస్తోంది. ఈ క్రమంలోనే కార్పొరేషన్ పరిధిలోని 11 రీజియన్ల నుంచి ఒక్కో డిపోను పైలట్ ప్రాజెక్ట్ కింద ఆర్టీసీ యాజమాన్యం ఎంపిక చేసింది. ఇక్కడ ఈ విధానం సక్సెస్ ఫుల్ అయితే దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది.
ఈ కొత్త విధానం ఏమిటంటే ?
ఆర్టీసీ తీసుకొచ్చిన కొత్త విధానం ప్రకారం … ఉదయం డ్యూటీకి వచ్చే డ్రైవరు తన సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాప్ చేసి డిపోలోని సెక్యూరిటీ ఆఫీస్ వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సాయంత్రి విధులు ముగించుకొని ఇంటికి వెళ్లే ముందు తమ ఫోన్‌ను తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంటినుంచి కానీ తమ కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎవైనా అత్యవసర సమయాల్లో వారితో మాట్లాడేందుకు డిపోల్లో ప్రత్యేకంగా ఓ సెల్‌ఫోన్ నంబరును ఆర్టీసీ అందుబాటులో తీసుకువచ్చింది. వారి కుటుంబ సభ్యులు ఆ నంబరుకు కాల్ చేసి డిపోకు సమాచారమిస్తే వారు సంబంధిత బస్సు కండక్టర్ ద్వారా సదరు డ్రైవర్‌తో మాట్లాడడానికి వీలు కల్పిస్తారు.
ఈ కొత్త విధానం ముందుగా ఏఏ డిపోల్లో అమలు కానుందంటే … ఫరూక్‌నగర్ (హైదరాబాద్), కూకట్‌పల్లి (సికింద్రాబాద్), కొల్లాపూర్ (మహబూబ్‌నగర్), సంగారెడ్డి (మెదక్), మిర్యాలగూడ (నల్గొండ), జగిత్యాల (కరీంనగర్), ఖమ్మం (ఖమ్మం), కామారెడ్డి (నిజామాబాద్), వికారాబాద్ (రంగారెడ్డి), ఉట్నూర్ (ఆదిలాబాద్), , పరకాల (వరంగల్)