Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్టీజీఎస్సీ పిసిఆర్ గౌరవ సభ్యురాలు జిల్లాలో ఆకస్మిక పర్యటన 

టీజీఎస్సీ పిసిఆర్ గౌరవ సభ్యురాలు జిల్లాలో ఆకస్మిక పర్యటన 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్  : టీజీఎస్సీ పిసిఆర్ గౌరవ సభ్యురాలు ప్రేమలత అగర్వాల్  నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం ఆకస్మిక సందర్శనలో భాగంగా, జిల్లా కేంద్రంలో గల బాలసదనం, శిశు గృహ, జిల్లా పరిషత్ హై స్కూల్ సారంగాపూర్ సందర్శించి, పిల్లలతో సంభాషించారు.  బాలసదనం శిశు గృహ లో సౌకర్యాలు మరియు సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులు లేరని ఆందోళన చెందకుండా పిల్లలు బాగా చదువుకోవాలని మరియు ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరారు. అలాగే, శిశు గృహాన్ని సందర్శించి, పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలు మరియు ప్రభుత్వం నుండి వారికి అవసరమైన మరియు పొందవలసిన సౌకర్యాల గురించి తెలియజేయాలని సూచనలు చేయలనికోరారు 

గౌరవ సభ్యురాలు ప్రేమలత అగర్వాల్ సారంగాపూర్‌లోని ఎంపీపీ ఎస్, జడ్పిహెచ్ఎస్, పాఠశాలలను సందర్శించి, పిల్లలకు పలు సూచనలు చేయడం జరిగింది. అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు ప్రపంచ స్థాయిలో వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. అని విద్యార్థులకు మాటామంతీ ద్వారా తెలియజేశారు. అలాగే తరగతి గదుల్లో సౌకర్యాల కొరత, పాత భవనాలు, మరుగుదొడ్ల కొరత మరియు సరైన సౌకర్యాల కొరతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వారివెంట జిల్లా సంక్షేమ అధికారి షేక్ రసూల్ బీ. జిల్లా బాలల రక్షణ అధికారి చైతన్య కుమార్,మండల విద్యాధికారి, స్కూల్ హెడ్ మాస్టర్ శిశు గృహ మేనేజర్, బాలసదనం సూపరింటెండెంట్ వినోద, స్వర్ణలత చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img