Thursday, September 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బిసి బిల్లు ఆమోదంపై కృతజ్ఞతలు..

బిసి బిల్లు ఆమోదంపై కృతజ్ఞతలు..

- Advertisement -

జాతీయ బిసి సంఘం జిల్లా ఇంచార్జి విజయగిరి సమ్మయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు

బడుగు బలహీన వర్గాల బిసిలకు 42 శాతం రిజర్వేషన్ గవర్నర్ ఆమోదం తెలిపినందుకు జాతీయ బిసి సంఘం భూపాలపల్లి జిల్లా ఇంచార్జి విజయగిరి సమ్మయ్య గురువారం ఒక ప్రకటనలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్.కృష్ణయ్య,బీసీ సంఘాల పోరాటం ద్వారా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ 42 శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇచ్చిన మాటకు కట్టుబడి అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదించి ప్రత్యేక తెలంగాణ ఇచ్చినట్టుగా తెలంగాణ బీసీల గుండెలో చిరస్థాయిలో నిలిచిపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీన్నారు. బీసీల  రిజర్వేషన్ కల సహకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి,టీపీసీసీ చిప్ మహేష్ కుమార్ గౌడ్.రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు,బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తోపాటు క్యాబినెట్ మంత్రి వర్గానికి,ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యే లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -