Saturday, November 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంముఖ్యమంత్రికి ధన్యవాదాలు

ముఖ్యమంత్రికి ధన్యవాదాలు

- Advertisement -

పీఎంటీఏ టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు తరాల జగదీష్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల నేషనల్‌ సర్వీస్‌ ఫైల్‌పై సంతకం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ప్రోగ్రెసివ్‌ మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (పీఎంటీఏ టీఎస్‌) రాష్ట్ర అధ్యక్షులు తరాల జగదీష్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రెండవ దశలో నియామకమైన మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల నోషనల్‌ సర్వీస్‌, పే పారిటీ ఫైల్‌పై సీఎం సంతకం చేసినట్టు చెప్పారు.
మోడల్‌ స్కూళ్లలో 2013లో కొంతమంది ఉపాధ్యాయులకు నియామకాలు చేపట్టి, కొన్ని అనివార్య కారణాలవల్ల మిగిలిన వారికి 2014లో నియమించారు. సాంకేతిక కారణాలతో సర్వీసు కోల్పోయిన ఉపాధ్యాయులు నాటి నుంచి తమకు న్యాయం చేయాలని మొదటి దశలో నియామకమైన ఉపాధ్యాయులతో సమానంగా సర్వీసును, వేతనాన్ని అందించాలని పీఎంటిఏ టీఎస్‌ సంఘం తరుపున పోరాటం చేశారని జగదీష్‌ వెల్లడించారు. ఉపాధ్యాయులు కోర్టు నుంచి కూడా ఉత్తర్వులు సాధించినట్టు గుర్తుచేశారు. ఈ ప్రభుత్వ నిర్ణయంతో 2014 సెప్టెంబర్‌లో నియామకమైన రెండవ దశ మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులకు మొదటి దశలో అనగా 2013 జూన్‌లో నియామకమైన ఉపాధ్యాయులతో సమానంగా సర్వీసును కల్పిస్తూ వారితో సమానంగా వేతనాన్ని సవరణ చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
సీఎం రేవంత్‌ రెడ్డి చారిత్రక నిర్ణయం తీసుకున్నారని టీఎంఎస్టీఏ రాష్ట్ర అధ్యక్షులు భూతం యాకమల్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -