Wednesday, November 19, 2025
E-PAPER
Homeసినిమాప్రభుత్వం, పోలీసు శాఖకి కృతజ్ఞతలు

ప్రభుత్వం, పోలీసు శాఖకి కృతజ్ఞతలు

- Advertisement -

సినీ పరిశ్రమను అతలాకుతలం చేస్తున్న పైరసీని అరికట్టడంలో కీలకపాత్ర పోషిస్తున్న ప్రభుత్వానికి, పోలీస్‌ శాఖకు మీడియాతో ద్వారా తెలుగు ఫిలింఛాంబర్‌ కృతజ్ఞతలు తెలిపింది.
ఐబొమ్మ వెబ్‌సైట్‌ ద్వారా వందల సినిమాలను పైరసీ రూపంలో చూపించి తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర నష్టాన్ని చవిచూసేలా చేసిన ఇమ్మడి రవిని పోలీసులు పట్టుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో మంగళవారం ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యక్షుడు భరత్‌ భూషణ్‌ మాట్లాడుతూ, ‘ఐబొమ్మ పైరసీ వెబ్సైటు ఓనర్‌ ఇమ్మడి రవిని పోలీసులు పట్టుకున్నందుకు పోలీస్‌ డిపార్ట్మెంట్‌ వారికి, ప్రభుత్వానికి అలాగే ఛాంబర్‌లో ఉన్న పైరసీ సెల్‌ వారికి కతజ్ఞతలు’ అని అన్నారు.
‘దేశం మొత్తంలో తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే పైరసీ సెల్‌ మెయింటైన్‌ చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సినీ పరిశ్రమకు అండగా నిలబడాలి. సోషల్‌ మీడియా ద్వారా పైరసీ వల్ల జరిగే నష్టాన్ని ప్రేక్షకులకు మరింత అర్థం అయ్యేలా చేయాలి. పైరసీ చేసేవారిని కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వం నుండి మాకు ఇంతగా అండగా నిలబడి సాయం చేసిన వారిని త్వరలో సత్కరించి, మా ధన్యవాదాలు తెలుపుకుంటాము’ అని నిర్మాత సి.కళ్యాణ్‌ చెప్పారు.
చదలవాడ శ్రీనివాసరావు, వల్లభనేని అనిల్‌ కుమార్‌, అమ్మి రాజు, దర్శకుడు వీర శంకర్‌ , ముత్యాల రాందాస్‌, బాపిరాజు, ప్రసన్న కుమార్‌, మీడియా నుండి రాంబాబు పైరసీ వల్ల పరిశ్రమకు, తద్వారా దాన్ని నమ్ముకున్న అందరికీ జరుగుతున్న తీవ్ర నష్టాన్ని వివరించారు. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే, అసలు పైరసీనే జరగకుండ ఉండాలని అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -