నవతెలంగాణ-డిచ్‌పల్లి: ఇందల్ వాయి మండల పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు డాక్టర్ సామల రాజేష్ ఆధ్వర్యంలో మంగళవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల జిల్లా కేంద్రంలో జిల్లా పద్మశాలి వసతి గృహ ఎన్నికల్లో మండలంలోని అమ్సాన్ పల్లి గ్రామానికి చెందిన తన్నీరు వాసు కల్చరల్ సెక్రటరీగా నియామకం పొందడంతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు డాక్టర్ సామల రాజేష్ మాట్లాడుతూ మండల వాసికి జిల్లా పద్మశాలి వసతి గృహ కల్చరల్ సెక్రటరీగా నియమకం పొందడం అర్సన్యం అన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో పద్మశాలి సంఘ సభ్యులు చిలివేరి గంగా దాస్, పల్లె రాజు,పేర్ల వెంకటరమణ తో పాటు తదితరులు పాల్గొన్నారు.