Sunday, October 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆదమరిస్తే అంతే ..

ఆదమరిస్తే అంతే ..

- Advertisement -

కోతకు గురైన ప్రధాన రోడ్డు 
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 

గ్రామీణ ప్రాంతాల్లో పచ్చటి పొలాలు, ఏపుగా పెరిగిన చెట్ల మధ్యన ఉన్న రహదారుల్లో ప్రయాణిస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో.. దాని వెంటే ప్రమాదాలు అంతే విధంగా పొంచి ఉంటాయి. అందుకు నిదర్శనం నసురుల్లాబాద్ మండలం నుండి బొప్పాస్ పల్లి, బైరాపూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు. ఈ మార్గంలో పయనిస్తున్న వారికి నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ 25వ డిస్ట్రిబ్యూటర్ కాలువ వద్ద ఉన్న కల్వర్టు ఇరువైపులా భారీ వర్ష కారణంగా 6 నుంచి 8 ఫీట్ల లోతు రోడ్డు కోతకు గురి కావడం, రోడ్డు పక్కనే పొదలు పెరగడంతో లోతైన గుంత సమీపం వెళ్లే వరకు కనిపించకపోవడంతో తరుచు ప్రమాదాలు జరుగుతున్నాయి.

అక్కడే రోడ్డుకు ఇరువైపులా దిమ్మెలు లేని కల్వర్టు గుంతలు ఉన్నాయి. కానీ ఇవి దగ్గరకు వెళ్తే కాని కనిపించవు. ఇది గమనించకుండా వెళ్తే ప్రమాదాలు జరగడం ఖాయం. ఏ మాత్రం ఆదమరిచినా.. ఇక అంతే సంగతులు!. ఇదే ప్రాంతంలో పలుమార్లు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అయినప్పటికీ ఆర్ అండ్ బీ అధికారులు ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. ఈ విషయం సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు లేకపోలేదు. ఇప్పటికై నా స్పందించి రోడ్డుకు ఇరువైపులా సూచిక బోర్డులు, భారీ వర్షం కారణంగా కోతకు గురైన రోడ్డుపై మొరం వెయ్యాలని, , సూచిక బోర్డు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -