రజనీకాంత్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన పాన్ ఇండియా యాక్షన్ మూవీ ‘కూలీ’. నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. అమీర్‌ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
సురేష్‌బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ఆసియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 14న ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ సందర్భంగా మేకర్స్ నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగార్జున మాట్లాడుతూ, ”నాకు కొత్తదనం ఇష్టం. సెట్‌కు వెళ్లాక బోర్ కొట్టకూడదంటే డిఫరెంట్ పాత్రలు చేయాలి. ఆ ప్రయత్నంతోనే ఇంతకాలం పని చేశాను. కొన్ని దెబ్బలు తిన్నా. మంచి మంచి విజయాలూ అందుకున్నాను. ఒకరోజు లోకేశ్ నన్ను కలిసి ‘మీరు విలన్‌గా చేస్తానంటే మీకో కథ చెబుతా. లేదంటే కాసిన్ని సినిమా కబుర్లు చెప్పి టీ తాగి వెళ్లిపోతా’ అన్నారు. ‘కూలీ’ కథ చెప్పిన తర్వాత నాకు చాలా నచ్చింది. ‘రజనీ సర్ ఈ కథ ఒప్పుకొన్నారా’ అని అడిగా. ఎందుకంటే ఈ కథలో ‘సైమన్’ పాత్ర కథలో ఆల్ మోస్ట్ హీరోలాంటిది. లోకేష్ హీరో, విలన్స్‌ని ఈక్వెల్‌గా చూపిస్తాడు. నాకు మూవీలో నెగెటివ్ రోల్ ఇచ్చినా ఈ పాత్ర చేసిన అనుభూతి పాజిటివ్‌గా ఉంది. షూటింగ్ సమయంలో రజనీ స్వయంగా వచ్చి, నాతో మాట్లాడారు. అది ఆయన గొప్పదనం. ఈ సినిమా నాకు చాలా పాజిటివ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన సినిమా’ అని అన్నారు.
స్పెషల్ వీడియో బైట్‌లో రజనీకాంత్ మాట్లాడుతూ,’నేను ఇండిస్టీకి వచ్చి 50 ఏళ్లు. ఈ సంవత్సరంలో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో నేను నటించిన ‘కూలీ’ ఈనెల 14న రావడం సంతోషంగా ఉంది. ఇది నా డైమండ్ జూబ్లీ పిక్చర్. తెలుగులో రాజమౌళి ఎలాగో తమిళంలో లోకేశ్ కనగరాజ్ అలా. ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఇందులో పలువురు స్టార్స్ నటించారు. ముఖ్యంగా నాగార్జున ఇందులో విలన్‌గా చేస్తున్నారు. ఆయన డబ్బు కోసం సినిమాలు చేసే వ్యక్తి కాదు. ఎప్పుడూ మంచివాడిగానే చేయాలా? అని ఆయన సైమన్ పాత్రకు ఒప్పుకొని ఉంటారు. మేమిద్దరం 33 ఏళ్ల కిందట ఒక సినిమా చేశాం. అప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పుడూ అలాగే ఉన్నారు. ఇంకా యంగ్‌గా కనిపిస్తున్నారు. సైమన్ పాత్రలో ఆయన నటన చూస్తుంటే, నాకే ఆశ్చర్యమేసింది. బాషా-ఆంటోనీ ఎలాగో.. కూలీ-సైమన్ అలా ఉంటుంది. సైమన్‌గా నాగార్జున అదరగొట్టేశారు’ అని చెప్పారు.
‘ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ని నాకు ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్‌కి థ్యాంక్యూ. నాగార్జునని ఈ సినిమాకి కన్వీన్స్ చేయడం అనేది నాకు పెద్ద ఛాలెంజ్. దాదాపు 7 నెరేషన్స్ ఇచ్చాను. ఫైనల్‌గా ఆయన ఒప్పుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయన ఈ సినిమాలో ఎంత అద్భుతంగా నటించారో మీరే చూడబోతున్నారు’ అని డైరెక్టర్ లోకేష్ కనకరాజు తెలిపారు.
అందుకే ‘కూలీ’లో విలన్‌గా నటించా : నాగార్జున
- Advertisement -
- Advertisement -