సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందనున్న నూతన చిత్రం ’16 రోజుల పండగ’. సాయి కష్ణ దమ్మాలపాటి హీరోగా పరిచయం అవుతున్నారు. గోపిక ఉదయన్ హీరోయిన్. ఈ చిత్రంలో రేణు దేశారు, అనసూయ భరద్వాజ్, వెన్నల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రదా పిక్చర్స్, సాయి సినీ చిత్ర బ్యానర్ పై ప్రొడక్షన్ నెం-1గా సురేష్ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ అడివి నిర్మిస్తున్నారు.
బుధవారం ఈ చిత్రం పూజాకార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కోన వెంకట్, కేకే రాధా మోహన్ నిర్మాతలకి స్క్రిప్ట్ అందించారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల క్లాప్ కొట్టారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కెమెరా స్విచాన్ చేశారు. ఫస్ట్ షాట్‌కు డి.సురేష్ బాబు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు అల్లు అరవింద్, మైత్రి రవి, దామోదర ప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరై, టీమ్‌కి అభినందనలు తెలిపారు.
ప్రొడ్యూసర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ, ‘అద్భుతమైన కథ ఇది. డైరెక్టర్ చెప్పిన కథ చాలా నచ్చింది. 16 రోజుల పండగ .. వందరోజుల పండగ కావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
”16 రోజుల పండగ’ టైటిల్‌ని సజెస్ట్ చేసింది దర్శకుడు కష్ణ వంశీ. ఆయనకి కథ విపరీతంగా నచ్చి, ఈ టైటిల్ పెట్టమని చెప్పారు. ఆయనకు కృతజ్ఞతలు’ అని దర్శకుడు సాయి కిరణ్ అడివి చెప్పారు.
రేణు దేశారు మాట్లాడుతూ, ‘సాయి కిరణ్ కోవిడ్ లాక్‌డౌన్‌కి ముందే ఈ కథ చెప్పారు. నాకు చాలా నచ్చింది. వెంటనే చేస్తానని చెప్పాను. ఇందులో అత్తమ్మ రోల్ చేస్తున్నాను. నా ఏజ్‌కి సరిపోతుందా అనిపించింది. కానీ ఆ పాత్ర, కథ అద్భుతమైనది. సినిమా చూస్తున్నప్పుడే ప్రేక్షకులకే అర్ధమైపోతుంది. ఇది కచ్చితం మంచి ఆదరణ పొందుతుంది’ అని తెలిపారు.
’16 రోజుల పండగ’ మొదలైంది
- Advertisement -
- Advertisement -



