– సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమన్న
నవతెలంగాణ – కామారెడ్డి
ఈనెల 6 తేదీన కామారెడ్డి జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా మూడవ మహాసభ కామారెడ్డి పట్టణం కేంద్రంలో మునుర్కాపు సంఘం వీక్లీ మార్కెట్ లో నిర్వహించడం జరుగుతుందని ఈ మహాసభకు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ జిల్లా మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే, కూనంనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ . సిపిఐ సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది, వీఎల్ నరసింహారెడ్డి, ఈ మూడో మహాసభలకు హాజరవుతారని ఆయన అన్నారు.
ఈ మహాసభలు దేశంలో రాష్ట్రంలో లౌకిక శక్తులను ఏకం చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని శ్రీకారం చుట్టడానికి ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వము అవలంబిస్తున్న మతోన్మాదానికి , పెరుగుతున్న దరలకు , ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, నిరుపేద మధ్యతరగతి సంబంధించిన బ్యాంకింగ్, ఎల్ఐసి, రైల్వే, రవాణా రంగం, అడవి ఖనజ సంపద, సింగరేణి, వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ మహాసభ నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ మహాసభకు సిపిఐ గ్రామ కార్యకర్తలు, సానుభూతిపరులు జిల్లా ప్రజలు సహకరించాలని, ఆరవ తేదీన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి ర్యాలీగా బయలుదేరి మున్నూరు కాపు సంఘానికి చేరుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమనికి సిపిఐ జిల్లా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మహాసభలు విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఎల్. దశరథ్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి బాలరాజ్, జిల్లా నాయకులు జి మల్లేష్, ప్రవీణ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.