Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి 

బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి 

- Advertisement -

బీఎల్ టియూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం దేశ వ్యాప్తంగా జరిగిన సమ్మె నిర్వహించారు. ఇందులో భాగంగా నగరంలోని పాత మున్సిపల్ కార్పొరేషన్ ముందు పార్క్ లో జరిగిన ధర్నాలో బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ బి ఎల్ టి యు రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ ‌సిద్ది రాములు మాట్లాడుతూ.. బిజెపి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎంతో ముందు చూపుతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన కార్మిక రక్షణ చట్టాలను, మోడీ నాయకత్వంలోని బిజెపి కేంద్ర ప్రభుత్వం స్వదేశీ,విదేశీ గుత్త పెట్టుబడిదారుల లాభాల కోసం రద్దు చేసిందని తెలిపారు.

మోడీ ప్రభుత్వం చెప్పేది సబకా వికాస్ సబకా సాత్ కానీ ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్నది మాత్రం అంబానీ, ఆదాని ఇతర విదేశీ కార్పోరేట్ కంపెనీల వికాసించే విధానాలను అనుసరిస్తూ భారత బహుజన కార్మిక వర్గాన్ని గుత్తా పెట్టుబడిదారలకు కట్టు బానిసలుగా మార్చేందుకు నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది బీడీ కార్మికులు ఉపాధి పొందుతున్న పరిశ్రమపై ఆంక్షలు విధించింది లక్షలాది మంది బీడీ కార్మికుల ఉపాధి దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీసం వేతనం రూ 26 అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆధిపత్య దోపిడి ఆర్థిక విధానాల వల్ల బహుజన శ్రామిక మహిళల శ్రమ దోపిడి తోపాటు లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ నుండి జిల్లా కోర్టు మీదుగా రాజీవ్ గాంధీ ఆడిటోరియం రైల్వే స్టేషన్ నుండి ప్రదర్శన నిర్వహించి ధర్నా చౌక్ లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్  జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ బిఎల్ టీయూ నాయకులు కె. రాహుల్ ,ఆర్. మురళి ,గంగా శంకర్, మున్సిపల్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు నవీన్ , అబ్బా పూర్ సాయిలు, మోహన్ గౌడ్, శ్రీశైలం,రాజేశ్వర్, శ్రీనివాస్, వసంత్,కిషోర్, అమేర్ బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఎం.డి. సయ్యద్ బహుళజన బీడీ టేకేదర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ నాయకులు ప్రభాకర్, మారుతి స్థానిక బిఎల్ టీయూ నాయకులు, మున్సిపల్, బీడీ, భవన నిర్మాణ, ఆటో తదితర రంగాలకు చెందిన కార్మికులకు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -