-సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గడిపె మల్లేశ్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
ప్రతి మూడు సంవత్సరాలకు ఓసారి జరిగే సిపిఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గడిపే మల్లేష్ కోరారు. బుధవారం సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ నాయకులతో కలిసి గొడ పోస్టర్లు,కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆగస్టు 19 నుంచి 22 వరకు మెడ్చేల్ జిల్లాలో జరగే సిపిఐ మహాసభలకు ప్రతి పల్లే పల్లే గ్రామీణ,పట్టణ ప్రాంతాల నుంచి సిపిఐ నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు యువతి యువకులు విద్యార్థినీ విద్యార్థులు,రైతులు కూలీలు సంఘటిత అసంఘటిత కార్మికులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జాగీర్ సత్య నారాయణ, సిపిఐ మండల సహాయ కార్యదర్శి పోదిల కుమారస్వామి,ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు జనగాం రాజ్ కుమార్, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ ,సిపిఐ పట్టణ కార్యదర్శి ఎగ్గోజు సుదర్శన్ చారి, సిపిఐ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES