మొగుళ్ళపల్లి తహసిల్దార్ పై ఆర్డీవోకు ఫిర్యాదు.
(ఆర్టిఐ)సమాచార హక్కు చట్టం
భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు.వెంకటేశ్వర్లు గౌడ్
నవ తెలంగాణ-భూపాలపల్లి:
సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం తమకు మొగుళ్ళపల్లి తాసిల్దార్ కార్యాలయం నుండి 2024 జూలై నుండి 2025 జులై వరకు మొగుళ్లపల్లి తాహసిల్దార్ బ్యాంక్ అకౌంట్ (ఎస్బిఐ) జమ ఖర్చు వివరాలు జిరాక్స్ కాపీలు ఇవ్వాలని. గత 40 రోజుల క్రితం మొగుళ్లపల్లి తహసిల్దార్ కు సహ చట్టం ద్వారా వివరాలు అడుగుతే ఇప్పటివరకు స్పందించని కారణంగా…బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా సమాచార హక్కు చట్టం భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు చెర్లపల్లి వెంకటేశ్వర్ గౌడ్, భూపాలపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి,కార్యాలయంలోమొగుళ్లపల్లి తాసిల్దార్ సునీతపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ మొగుళ్లపల్లి తహసిల్దార్ ఫిర్యాదు చేశారు, ఈ సందర్భంగా సహా చట్టం జిల్లా అధ్యక్షులు చర్లపల్లి వెంకటేశ్వర్ గౌడ్ పాత్రికేయులతో మాట్లాడుతూ…సమాచార హక్కు చట్టాన్ని ద్వారా 40 రోజులు అయిన సమాచారం ఇవ్వకపోవడం వలన భూపాలపల్లి ఆర్డీవో కార్యాలయంలో అప్పీలేట్ అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు మొగుళ్ళపల్లి తాహసిల్దార్ పై చర్యలు తీసుకోవాలని సహ చట్టం ద్వారా అడిగిన సమాచారాన్ని తమకు అందించాలని ఆర్డిఓ ను కోరారు స్థానిక ఆర్డిఓ విధుల్లో లేకపోవడంతో కార్యాలయ సహా చట్టం జిల్లా అధ్యక్షులు చర్లపల్లి వెంకటేశ్వర్లు ఇన్వార్డ్ సెక్షన్లో విధులు నిర్వహిస్తున్న రాజేష్ కు దరఖాస్తు అందించి నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు జీ పోశయ్య, కుమార్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు*.
అవినీతి అధికారుల ప్రక్షాళనే ఆర్టిఐ లక్ష్యం.!!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES