- Advertisement -
హిమాచల్‌ప్రదేశ్ సెక్రెటేరియట్ వద్ద నిరసన
సిమ్లా: ఆపిల్ రైతులు రోడ్డెక్కారు. ఏండ్ల తరబడి ఆపిల్ పంటపై ఆధారపడుతున్న తమను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హిమాచల్ కిసాన్ సభ , ఆపిల్ గ్రోవర్స్ సొసైటీ సభ్యులు మంగళవారం సిమ్లాలోని హిమాచల్‌ప్రదేశ్ సెక్రెటేరియట్ వద్ద నిరసన తెలిపారు. ఆపిల్ తోటల యజమానులు, రైతులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా ప్రదర్శనగా తరలివచ్చారు. హిమాచల్ ప్రదేశ్ సర్కార్ తమ సమస్యలను పరిష్కరించకపోతే..ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
- Advertisement -